Frs

Frs


భారత రాజ్యాంగంలో మూడవ భాగంలో 12 నుండి 35 ప్రకరణలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అమెరికా రాజ్యాంగ స్ఫూర్తి (అనగా బిల్ ఆఫ్ రైట్స్ )తో మన రాజ్యాంగ నిర్మాతలు ఈ హక్కులను పొందుపరిచారు. రాజ్యాంగంలోని మూడవ భాగంని భారతీయుల మాగ్నా కార్తా' అని పిలువవచ్చును. ఇందులో పొందుపరిచిన న్యాయ నిర్ణేతుకమైన' ప్రాథమిక హక్కులు ఎంతో విస్తృతమైనవి మరియు సమగ్రమైనవి. ఇవి ప్రపంచంలోని ఏ ఇతర రాజ్యాంగాలలోని (అమెరికాతో సహా) ప్రాథమిక హక్కుల కన్నా వివరణాత్మకమైనవి. వ్యక్తుల మధ్య ఎటువంటి వివక్షతలు లేకుండా ప్రాథమిక హక్కులను రాజ్యాంగం కాపాడుతుంది. జాతి సమైక్యతను, జన బాహుళ్ల ప్రయోజనాన్ని, వ్యక్తి ఔన్నత్యాన్ని, వ్యక్తుల మధ్య సమానత్వాన్ని ప్రాథమిక హక్కులు కలిగిస్తాయి. ప్రాథమిక హక్కులు రాజకీయ ప్రజాస్వామ్య ఆదర్శాన్ని పెంపొందిస్తాయి. దేశంలో అధికారతత్వ, నిరంకుశ పాలనను అవి నిరోధిస్తాయి. ప్రజల హక్కులను, స్వేచ్ఛలను రాజ్యాధికారం నుండి అవి కాపాడుతాయి. కార్య నిర్వాహక వర్గ నిరంకుశత్వాన్ని ,శాసన సభ ఇష్టానుసారంగా శాసనాలు చేయడాన్ని ప్రాథమిక హక్కులు ప్రతిఘటిస్తాయి. ఒక రకంగా అవి శాసనబద్ధమైన ప్రభుత్వ స్థాపనకు దోహదం చేస్తాయి. దేశానికి ప్రాథమిక, మౌలిక చట్టంగా పేర్కొనబడే రాజ్యాంగం ప్రాథమిక హక్కులను సంరక్షిస్తుంది. వ్యక్తుల సర్వతో ముఖాభివృద్ధికి,

వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసే ఈ హక్కులను ప్రాథమిక హక్కులు'గా పేర్కొనడం జరిగింది. మన మౌలిక రాజ్యాంగం ఏడు ప్రాథమిక హక్కులను ప్రసాదించింది. అవి: 1. సమానత్వ హక్కు (14-18 ప్రకరణలు) 2. స్వేచ్ఛా హక్కు (19-22 ప్రకరణలు) 3. పీడన నిరోధక హక్కు (23-24 ప్రకరణలు) 4. మత స్వేచ్ఛ హక్కు (25-28 ప్రకరణలు) 5. సాంస్కృతిక విద్యా హక్కు(29 - 30 ప్రకరణలు) 6. ఆస్తి హక్కు (31వ ప్రకరణ) 7. రాజ్యాంగ పరిరక్షణ హక్కు (32వ ప్రకరణ) ఆస్తి హక్కుని 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978 ప్రాథమిక హక్కుల నుండి తొలగించింది. ఇది XII వ భాగంలో 300-A లో చట్టబద్ధమైన హక్కుగా అయింది. కనుక, ప్రస్తుతం ఆరు థమిక హక్కులు మాత్రమే ఉన్నాయి. ప్రాథమిక హక్కుల లక్షణాలు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల లక్షణాలు ఏమనగా.. 1. కొన్ని ప్రాథమిక హక్కులు పౌరులకు మాత్రమే ప్రత్యేకంగా ఇవ్వబడతాయి. మిగిలిన హక్కులు అందరి వ్యక్తులకు

3. అనగా పౌరులకు, విదేశీయులకు, చట్టబద్ధ వ్యక్తులకు అనగా కార్పొరేషన్లకు, కంపెనీలకు ఇవ్వడతాయి. ప్రాథమిక హక్కులు అపరిమితమైనవి కావు. అవి గుణాత్మకమైనవి. రాజ్యం వాటి పై సహేతుకమైన నిబంధనలను విధించవచ్చును. అయితే వాటి సహే తుకత ఔచిత్యాన్ని న్యాయస్థానాలు విచారించవచ్చును. ఈ విధంగా వ్యక్తుల హక్కులను, సమాజ పరమైన హక్కు లకు సమతుల్యతని సాధించడం ప్రాథమికహక్కుల లక్ష్యం. రాజ్య చర్యలకు వ్యతిరేకమైనవి, ప్రయివేటు వ్యక్తుల చర్యలకు వ్యతిరేకమైనవి తప్ప చాలా వరకు ఈ హక్కులు రాజ్య నిరంకుశ చర్యలను నిరోధిస్తాయి. రాజ్య చర్యలకు ఏ హక్కులు అయితే అందుబాటులో ఉంటాయో వాటిని ప్రయివేటు వ్యక్తులు ఉల్లంఘించినట్లయితే వాటికి సంబంధించిన రాజ్యాంగ పరిహారం లభించదు. కానీ చట్టబద్ధమైన పరిహారం లభిస్తుంది. 4. కొన్ని హక్కులు నకరాత్మకమైనవి(negative in char- acter). అవి రాజ్యా ధికారంపై పరిమితులు విధిస్తాయి. కొన్ని సకరాత్మ కమైనవి (positive in nature), అవి వ్యక్తులకు గల ప్రత్యేకాధికారాలను తెలియ బరుస్తాయి. 5. అవి న్యాయ నిర్దేతకమైనవి, హక్కులకకు భంగం జరిగితే, వ్యక్తులు వాటి అమలుకై న్యాయస్థానాలకు వెళ్లవచ్చును. 6. సుప్రీంకోర్టుచే ఈ హక్కులకు హామీ, రక్షణ ఉన్నాయి. బాధితుడైన వ్యక్తి నేరుగా సుప్రీంకోర్టుని ఆశ్రయిం చవచ్చును. హైకోర్టు అప్పీలకు వ్యతిరేకంగా వెళ్ల వలసిన అవసరం లేదు. అవి పవిత్రమైనవి కావు. శాశ్వతమైనవి కావు. సాధారణ చట్టాల ద్వారా కాకుండా రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా , మాత్రమే పార్లమెంట్ వీటిని తగ్గింవచ్చును. అయితే, ఈ సవరణలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం జరగకుండా ఉండాలి. (ప్రాథమిక హక్కుల చట్ట బద్ధత గురించి 11వ అద్యాయంలో వివరించడం జరిగింది.) 20, 21 ప్రకరణలలోని హక్కులు తప్ప మిగిలినవి, జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో సస్పెండ్ (నిలుపుదలు కావచ్చును. 19వ ప్రకరణలోని ఆరు స్వేచ్ఛలు మాత్రం 'యుద్ధం వల్ల, బాహ్యదాడుల వల్ల'

(అనగా బాహ్య అత్యవసర పరిస్థితి) ఎమర్జెన్సీ విధించినప్పుడు సస్పెండ్ అవుతాయి. అనగా 'సాయుధ విప్లవాల వల్ల' (అనగా అంతరంగిక అత్యవసర పరిస్థితి) ఎమర్జెన్సీ విధించినప్పుడు ఇవి సస్పెండ్ కావు. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో (ప్రాథమిక హక్కుల నిలుపుదల గురించి 16వ అద్యాయంలో విపులీకరించబడినది. ) 9. 314 ప్రకరణ (ఎస్టేట్లు మొదలగు వాటి అర్జన కొరకై శాసనములకు కలిగించిన మినహాయింపు: 318 ప్రకరణ (9వ షెడ్యూల్ లో చేర్చిన ఏవేని చట్టాలు, రెగ్యులేషన్లకు శాసనమాన్యత(చెల్లుబడి) కలిగించడం; కొన్ని ఆదేశిక సూత్రాలను అమలు పరుచు శాసనాలకు మినహాయింపులు (31-C) వంటి అంశాలు ప్రాథమిక హక్కుల పరిధిని పరిమితం చేస్తాయి. 10. సాయుధ దళాలలోని సభ్యులకు, లేదా ప్రజా శాంతి పరిరక్షణ భారము వహించిన దళ సభ్యులకు, లేదా రహస్య సమాచార సేకరణ లేదా దానికి ప్రతికూల రహస్య సమాచార సేకరణకై ప్రభుత్వం స్థాపించిన వ్యవస్థలలో నియమింపబడిన వ్యక్తులకు పరిమితమైన హక్కులను పార్లమెంట్ ప్రత్యేక చట్టం ద్వారా గుర్తిస్తుంది. (33వ ప్రకరణ). 11. సైనిక శాసనం అమలులో ఉన్న ప్రాంతంలో ప్రాథమిక హక్కులపై ఆంక్షలు ఉంటాయి. సైనిక శాసనం (మార్షల్లా) అనగా సైనిక పాలన అసాధారణ పరిస్థితులలో శాంతి భద్రతలు కాపాడటానికి ఈ సైనిక పాలనను విధించవచ్చును. (34వ ప్రకరణ). జాతీయ అత్యవసర పరిస్థితి విధింపుగా దీనిని భావించరాదు. 12. ఈ హక్కులు చాలా వరకు నేరుగా అమలులో ఉంటాయి. కానీ కొన్ని హక్కులు మాత్రం అమలు కావడానికి ప్రత్యేక శాసనం ఉండాలి. ఇటువంటి శాసనాన్ని చేసే అధికారం పార్లమెంట్ కి మాత్రమే ఉంది. రాష్ట్ర శాసన సభకి ఈ అధికారం ఉండదు. ఈ విధంగా ఉన్న అంశం యొక్క ప్రధాన ధ్యేయం దేశం మొత్తంలో ఏకరూపత కలగజేయడం. (35వ ప్రకరణ). రాజ్య నిర్వచనం ప్రాథమిక హక్కులలో “రాజ్యం ”అనే పదాన్ని వివిధ సందర్భాలలో

మూడవ భాగంలో రాజ్యం అనే పదాన్ని నిర్వచించడం జరిగింది. ఈ నిర్వచనం ప్రకారం 'రాజ్యం ' అనగా.. (a). భారత ప్రభుత్వం, పార్లమెంట్ (అనగా కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక, శాసన వర్గ శాఖలు). (b). రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర శాసనసభలు (అనగా రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక, శాసన వర్గ శాఖలు). - (c). స్థానిక అధికార సంస్థలు (అనగా మున్సిపాలిటీలు పంచాయతీలు, జిల్లా బోర్డులు, ట్రస్టు మొ||) (d). ఇతర అధికార సంస్థలు (అనగా చట్టబద్ధమైన లేదా చట్ట బద్దం కాని సంస్థలు. ఉదా : LIC, ONGC, SAIL మొ||) ఈ విధంగా అన్ని సంస్థలు విశాలమైన “రాజ్యం” అనే నిర్వచనంలో ఉన్నాయి. ఈ సంస్థల కార్యకలాపాలేవైనా సరే ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉండే న్యాయస్థానాలలో సవాలు చేయవచ్చును. రాజ్యం ఆధ్వర్యంలో పనిచేసే ఒక ప్రయివేటు ఏజెన్సీ కూడా 12వ ప్రకరణ లోని “రాజ్యం ” అనే భావనలో వస్తుందని సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్న శాసనాలు 13వ ప్రకరణ ప్రకారం ప్రాథమిక హక్కులకు అసంగతంగా లేదా అప్రతిష్టాకరంగా ఉన్న శాసనాలు చెల్లుబడి కావు. ఒక రకంగా చెప్పాలంటే, ఈ ప్రకరణ న్యాయ సమీక్ష అధికారాన్ని

వ్యక్త పరుస్తుంది. ఈ అధికారాన్ని సుప్రీంకోర్టుకి 32వ ప్రకరణ ద్వారా, హైకోర్టుకి 226వ ప్రకరణ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ న్యాయ స్థానాలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలని శాసనాలని రాజ్యాంగ విరుద్ధమని చెల్లనేరవని తీర్పు చెప్పవచ్చును. 13వ ప్రకరణలోని 'చట్టం” అనే పదానికి విస్తృతమైన అర్ధాలు ఉన్నాయి. అవి: (a). పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసన సభలు చేసిన శాసనాలు (సంపూర్ణమైనవి). (b). రాష్ట్రపతి లేదా రాష్ట్ర గవర్నర్లు జారీ చేసే ఆర్డినెన్సులు (c). శాసన దత్తత ద్వారా(కార్య నిర్వాహక శాసనం) జారీ అయ్యే ఆర్డర్లు, బైలాస్, రూల్స్, రెగ్యులేషన్స్, నోటిఫికేషన్లు మొ|| (d). శాసనబద్దం కాని శాసనాధారాలు - ఆచారాలు, వ్యవహరాలు. ఈ విధంగా శాసనాలతో పాటు పై ఏవైనా ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే వాటిని న్యాయస్థానాలు 'చెల్లవు' అని కొట్టి వేయవచ్చును. - 13వ ప్రకరణలో “రాజ్యాంగ సవరణ”ను చట్టం కాదని పేర్కొనడం జరిగింది. కానీ కేశవానంద భారతి (1973) కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించేటట్లుగా ప్రాథమిక హక్కులకు రాజ్యాంగ సవరణ జరిగితే అది చెల్లదు అని తీర్పు చెప్పింది.

వట్టిక 7.2 (కంటిన్యూడ్) విదేశీయులకు కాకుండా కేవలం పౌరులకు | విదేశీయులకు, పౌరులకు వర్తించే ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్న హక్కులు (శత్రుదేశాలకు చెందిన పరదేశీయులకు కాకుండా) 4. అల్ప సంఖ్యాక వర్గాల వారి భాష, లిపి, సంస్కృతి | 4. ప్రాథమిక విద్యను పొందే హక్కు (214) రక్షణ (29వ ప్రకరణ). 5. విద్యా సంస్థలు నెలకొల్పడానికి, నిర్వహించుకోవ | 5. కొన్ని వివాదాల్లో ఆరెస్టు నుంచి, నిర్బంధం నుంచి డానికి అల్ప సంఖ్యాక వర్గీయుల హక్కు రక్షణ (22వ ప్రకరణ). (30వ ప్రకరణ), మనుష్యులతో వ్యాపారం, బలవంతపు చాకిరి నిషేధం (23వ ప్రకరణ). 7. ఫ్యాక్టరీ, గనుల వంటి ప్రమాదకర ఉద్యోగాలలో చిన్న పిల్లల నియామకం నిషేదం, మొ|| (24వ ప్రకరణ) అంతరాత్మని అనుసరించి స్వేచ్ఛగా మతాన్ని అవలంభించడానికి, ప్రచారం చేసుకోవడానికి స్వేచ్ఛ (25వ ప్రకరణ). 9. మత వ్యవహారాలని నిర్వహించుకునే స్వేచ్ఛ (26 ప్రకరణ) | 10. మత్యవ్యాప్తికోసం పన్నులు కట్టడంలో స్వేచ్ఛ(27 ప్రకరణ) 11. విద్యా సంస్థలలో మతబోధన, ఆరాధన విషయాల గురించి స్వేచ్ఛ (28వ ప్రకరణ) -

సమానత్వ హక్కు 1. చట్టం ముందు సమానత్వం మరియు చట్టం వల్ల సమాన రక్షణ “చట్టం ముందు సమానత్వాన్ని, చట్టం వల్ల సమాన రక్షణను భారత భూభాగంలో రాజ్యం ఏ వ్యక్తికి నిరాకరించరాదు” అని 14వ ప్రకరణ పేర్కొంటుంది. ఈ అంశం అందరి వ్యక్తులకు (పౌరులైనా, విదేశీయులైనా) చెందుతుంది. ఇందులోని 'వ్యక్తి' అనే పదంలో చట్టబద్ధమైన కార్పోరేషన్లు, కంపెనీలు, రిజిస్టర్డ్ సొసైటీలు మొ|| శాసన ఆధీకృత వ్యక్తులందరూ ఉంటారు. - చట్టం ముందు సమానత్వం" అనే భావన బ్రిటీష్ రాజ్యాంగ స్ఫూర్తి కాగా చట్టం వల్ల సమాన రక్షణ అనే భావన అమెరికన్ రాజ్యాంగ స్ఫూర్తి. మొదటి భావనలో ఉన్న ప్రధానాంశాలు (a), ఎవరికి ప్రత్యేకమైన హక్కులు లేకపోవడం, (b). సాధారణ న్యాయస్థానాల ద్వారా సాధారణ శాసనాలకి అందరు వ్యక్తులు బదులుగా ఉండటం, మరియు (c) చట్టానికి ఎవరూ (ధనిక, పేద, ఉన్నత, దిగువ, అధికార లేదా అనధికార వ్యక్తులు) అతీతులు కారు. ఇక రెండవ భాగంలో ఉన్న ప్రధానాంశాలు: (a) ప్రత్యేక

మాదాలు ఇవ్వడంలో, బాధ్యతలను ఇవ్వడంలో సమాన పరిస్థితుల దృష్ట్యా సమాన రక్షణ (b) సమాన స్థితులలో ఉన్న వారికి సమాన శాసనాల వర్తింపు, (c). ఎటువంటి వివక్షత లేకుండా అందరిని సమానంగా చూడటం. ఈ విధంగా మొదటి భావన నకరాత్మకంగా, రెండవ భావన సకారాత్మకంగా ఉన్నప్ప టికీ రెండు భావనల ప్రధాన ధ్యేయం సమానం చట్ట సదాని, అవకాశాలని, న్యాయాన్ని కలుగజేయడమే. సమానులను, అసమానులను విడివిడిగా పరిగణించినప్పుడు 14వ ప్రకరణ వర్తించదని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. 14వ ప్రకరణ వర్గపరమైన శాసనాలని నిషేదిస్తుంది. కానీ శాసన బద్దంగా చేసే హేతుబద్ధమైన వ్యక్తుల వర్గీకరణను అది అనుమతి స్తుంది. కానీ, ఈ వర్గీకరణను ఇష్టానుసారంగా కృత్రిమంగా, డొంక తిరుగుడుగా చేయరాదు. దృఢమైన, బేధాత్మక, మేధో పరమైన, సహేతుకమైన ఆధారాలతో ఈ వర్గీకరణ ఉండాలి. నమన్యాయం : 'చట్టం ముందు సమానత్వము' అనే భావన బ్రిటీష్ న్యాయ శాస్త్రవేత్త ఎ.వి.డైసీ ప్రతిపాదించిన సమన్యాయం'

అనే సిద్ధాంతం నుండి గ్రహించబడినది. ఇతని సిద్ధాంతంలో మూడు లక్షణాలు లేక అంశాలు ఉన్నాయి. 1). నిరాపేక్షాధికారం లేకుండా ఉండటం, అనగా చట్టాన్ని ఉల్లంఘిస్తే తప్ప ఏ వ్యక్తిని శిక్షించరాదు. ii). చట్టం ముందు సమానము, అనగా సాధారణ న్యాయ స్థానాల ద్వారా, సాధారణ శాసనాలకి అందరు వ్యక్తులు బద్దులుగా ఉండటం, చట్టానికి ఎవరూ (ధనిక లేదా పేద, ఉన్నత లేక దిగువ, అధికార లేదా అనధికారులు) అతీతులుగా లేకుండా ఉండటం. ii). వ్యక్తుల హక్కులకు ప్రాధన్యత నివ్వడం, అనగా వ్యక్తుల హక్కులు రాజ్యాంగానికి ఆధారం. అవి రాజ్యాంగం ద్వారా కాక సాధారణ న్యాయస్థానాల ద్వారా అమలు కావాలి. పైన పేర్కొన్న అంశాలలో మొదటి రెండు భారత రాజకీయ వ్యవస్థకు వర్తిస్తాయి. భారత రాజకీయ వ్యవస్థలో వ్యక్తుల హక్కులకు రాజ్యాంగం మూలాధారం. . 14వ ప్రకరణలో పొందుపరిచినటువంటి సమన్యాయం 'రాజ్యాంగంలో ఒక మౌలిక లక్షణం' అని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. రాజ్యాంగ సవరణ ద్వారా కూడా దీనిని తొలగించలేము. సమానత్వానికి మినహాయింపులు : చట్టం ముందు సమానత్వం అనే సూత్రం అపరిమితమైనది కాదు. దీనికి రాజ్యాంగం ద్వారా, ఇతరత్రా మినహాయింపులు ఉన్నాయి. అవి; 1. భారత రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నరు కొన్ని రక్షణలు ఉన్నాయి. (36 వ ప్రకరణ). i). తన అధికారాలు, విధులు నిర్వహించడంలో రాష్ట్రపతి కానీ, గవర్నర్ కానీ, ఏ న్యాయ స్థానానికి జవాబుదారీ కాడు. ii). రాష్ట్రపతి లేదా రాష్ట్ర గవర్నర్ పై అతని పదవీ కాలంలో ఎలాంటి క్రిమినల్ చర్యలు కానీ దాఖలు చేయరాదు లేదా కొనసాగించరాదు. ii). రాష్ట్రపతి కానీ లేదా రాష్ట్ర గవర్నర్ ని గానీ అతని పదవీ కాలంలో ఏ న్యాయ స్థానము అరెస్టు చేయడానికి లేదా ఖైదు విధించడానికి ప్రాసెస్ చేయరాదు. iv). పదవిలో ప్రవేశించే పూర్వం లేదా ప్రవేశించిన తర్వాత వ్యక్తిగత హెూదాలో చేపట్టిన చర్యల గురించి పదవిలో కొనసాగినంత కాలం రాష్ట్రపతి పై కానీ, గవర్నర్ పై కానీ ఎటువంటి సివిల్ దావాలను దాఖలు చేయరాదు. ఆ విధంగా దాఖలు చేయడానికి రెండు నెలల ముందుగా నోటీస్ ఇవ్వాలి.

2. పార్లమెంట్ లో లేదా శాసన సభలలో పొసీడింగుల గురించి యదార్థ నివేదికను వార్తా పత్రికల్లో (రేడియో టెలివిజన్లలో) ప్రచురించుటకు సంబంధించి, ఆ ప్రచురణ ద్వేషముతో కూడినదిగా రుజువు చేయబడితే తప్ప, ఏ న్యాయస్థానములో నైనా ఏ వ్యక్తి కానీ సివిల్ లేదా క్రిమినల్ చర్యలకు పాత్రుడు కాడు (361-A) 3. ఏ పార్లమెంట్ సభ్యుడు, పార్లమెంట్లో లేక దానికి చెందిన తాను చెప్పిన విషయం గురించి లేక ఓటు గురించి, ఏ న్యాయస్థాన ముందు ఎట్టి చర్యలు తీసుకొన బడుటకు పాత్రుడు కారాదు. (105 ప్రకరణ). 4. ఏ రాష్ట్ర శాసన సభ్యుడు, శాసనసభలో లేక దానికి చెందిన తాను చెప్పిన విషయం గురించి లేదా ఓటు గురించి, ఏ న్యాయస్థానం ముందు ఎట్టి చర్యలు తీసుకొనబడుటకు పాత్రుడు కారాదు. (194వ ప్రకరణ). 5. 31-0 ప్రకరణ 14వ ప్రకరణకు మినహాయింపుగా ఉంటుంది. ఈ ప్రకరణ ప్రకారం “ 39వ ప్రకరణ లోని (b) క్లాజులో లేదా (C) క్లాజులో పొందుపరిచిన ఆదేశిక సూత్రాల అమలు నిమిత్తమై రాజ్యం చేసిన శాసనాలను 14వ ప్రకరణకు భంగకరంగా ఉన్నవని న్యాయ స్థానాలలో సవాలు చేయరాదు. “ఎక్కడ 31-C ప్రకరణ వస్తుందో, అక్కడ 14వ ప్రకరణ ఉండదు” అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 6. విదేశీ సార్వభౌములు (పరిపాలకులు), రాయబారులు, దౌత్యవేత్తలు క్రమినల్, సివిల్ ప్రొసీడింగులకు అతీతులు. 17. ఐక్యరాజ్య సమితి, దాని ప్రతినిధులు కూడా రక్షణలు కలిగి ఉంటారు. 2. కొన్ని కారణాలపై వివక్షతలు చూపటంపై నిషేదం 15వ ప్రకరణ ప్రకారం ఏ పౌరునికి విరుద్దంగా కేవలం మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం అనే కారణాలను బట్టి రాజ్యం ఏ పౌరునికి విరుద్ధంగా వివక్షత చూపరాదు. ఈ అంశంలో ప్రధానమైన రెండు పదాలు 'వివక్షత' మరియు 'కేవలం' వివక్షత అనగా- వివిధ వర్గాల మధ్య అసమంజసమైన భేద భావాలు చూపించడం. 'కేవలం' అనే పదం ద్వారా ఈ వివక్షత ఏ కారణాలపై ఉండరాదు. 15వ ప్రకరణలోని రెండవ అంశం ప్రకారం “ఏ పౌరునికి కేవలం మత, జాతి, కుల, లింగ, జన్మ స్థలం కారణంగా

తరగతుల same 5.clave a వీటిని బట్టి కాని (a). దుకాణాలలో, ప్రజా ఉపహార శాలల్లో, సూటళ్లలో, సార్వజనీన వినోద స్థలాలలో ప్రవేశించే విషయంలో లేదా (b). పూర్తిగా నైనా, కొంత వరకైనా రాజ్య నిధులచే నిర్వహించబడే లేదా ప్రజా ఉపయోగార్థం, అంకితం చేసిన బావులను, చెరువులను, స్నాన ఘట్టాలను, రోడ్లను, విహార స్థలాలను ఉపయోగించే విషయం ఏ రకమైన అనర్హతలకు బాధ్యతకు, నిర్బంధానికి లోనైయ్యేటట్లు ఏ పౌరున్నీ చేయరాదు. “ఈ అంశంలో రాజ్యము మరియు ప్రయివేటు వ్యక్తులు కూడా వివక్షతను చూపరాదు. కానీ మొదటి అంశం రాజ్యాన్ని మాత్రమే వివక్షతను చూపరాదని పేర్కొంటుంది. ఈ 'వివక్షతా రాహిత్యం 'లో మూడు మినహాయింపులు ఉన్నాయి. అవి: (a). స్త్రీలకు, పిల్లలకు రాజ్యం ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చును. ఉదాహరణకు, ప్రాంతీయ స్వపరిపాలనా సంస్థలలో స్త్రీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. (b). సాంఘికంగాను, విద్యావిషయికంగాను, వెనకబడిన ఆ తరగతులకు చెందిన పౌరుల అభివృద్ధికి, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకై విశేష నిబంధనలని రాజ్యం చేయవచ్చును. ఉదాహరణకు ప్రభుత్వ విద్యా సంస్థలలో సీట్ల రిజర్వేషన్లు, ఫీజుల చెల్లింపులలో రాయితీలు మొ॥ చంపకందులు మదా (c). మైనారిటీ విద్యా సంస్థలను మినహాయించి మిగతా ఎయిడెడ్, ప్రయివేట్ విద్యా సంస్థలతో సహా అన్ని విద్యా సంస్థల ప్రవేశాలలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు, సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన బీసీ వర్గాల వారికి రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించే ప్రత్యేక నిబంధనలను రాజ్యం చేయాలి. పై చివరి అంశాన్ని 93వ రాజ్యాంగ సవరణ చట్టం, 1956 ద్వారా చేర్చడం జరిగింది. ఈ అంశానికి తగిన ప్రాధాన్యత నివ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్సిట్యూషన్ (రిజర్వేషన్ ఇన్ ఎడ్మిషన్) ఏక్ట్, 2006 ని ఈ చట్టం ఇతర వెనకబడిన తరగతుల వారికి (ఓబీసీ)కి 27% రిజర్వేషన్లని కేంద్ర ఉన్నత విద్యా సంస్థలలో కలుగజేసింది. ఐఐటీలు, ఐఐఎంలు కూడా ఇందులో ఉన్నాయి. ఏప్రిల్, 2008లో సుప్రీంకోర్టు సవరణ చట్టాన్ని ఓబీసీ కోటా చట్టాన్ని రెండింటిని ఆమోదించింది. అయితే, ఓబీసీ లలో క్రిమీలేయర్లని (ఉన్నత వర్గాలు) మినహాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. చంపకందుర్తి

అధికార సంస్థలో కానీ లేదా ఏ ఇతర అధికార సంస్థలో కానీ కొన్ని ఉద్యోగాలలో, నియామకాలతో నివాస స్థలాన్ని ఒక అర్హతగా పార్లమెంట్ నిర్ణయించవచ్చును. అయితే, పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (రిక్వయిర్మెంట్ యాజ్ టు రెసిడెన్స్) చట్టం, 1957, 1974లో రద్దయిన కారణంగా, ఈ అంశం కేవలం ఆంద్రప్రదేశ్ లో తప్ప ఎక్కడా లేదు. b). రాష్ట్ర సర్వీసులలో తగినంత ప్రాతినిథ్యం లేని వెనకబడిన తరగతుల వారికి రాజ్యం ఉద్యోగాలలో రిజర్వేషన్లను ఇవ్వవచ్చును. C). ప్రభుత్వంలో ఏదైనా ఒక శాఖలో ఒక మత విశ్వాసానికి సంబంధించిన విషయం ఉన్నప్పుడు ఆ శాఖలో కేవలం మత విశ్వాసాలకు చెందిన వారినే నియమించేందుకు రాజ్యం చట్టం రూపొందించవచ్చును. మండల్ కమీషన్ మరియు తదుపరి పరిణామాలు : 1979లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం పార్లమెంట్ సభ్యుడైన బి.పి.మండల్ అధ్యక్షతన రెండవ వెనకబడిన తరగతుల కమీషన్ (Second Back- ward Classes Commission) ని నియమించింది. 34వ ప్రకరణను అనుసరించి సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతుల వారి పరిస్థితులను పరిశోధించి, వారి అభ్యున్నతికి తగు సూచనలను ఇవ్వమని ప్రభుత్వం ఈ కమీషన్‌ను ఆదేశించింది. కమీషన్ 1980లో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. 3743 కులాలని సామాజి కంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతులుగా కమీషన్ గుర్తించింది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారిని మినహాయించగా మొత్తం జనాభాలో ఈ కులాలా వారు 52% ఉన్నారు. ఇతర వెనకబడిన తరగతులకి (ఓబీసీలకు) ప్రభుత్వం 27% ఉద్యోగాలను రిజర్వు చేయాలని, తద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అందరికి కలిపి 50% రిజర్వేషన్లు ఉంటాయని కమీషన్ పేర్కొన్నది. ' పది సంవత్సరాల తర్వాత వి.పి.సింగ్ ప్రభుత్వం ఓబీసీలకు 27% రిజర్వేషన్లని ప్రకటించింది. అయితే, 1991లో నరసింహరావు ప్రభుత్వం రెండు మార్పులను ప్రవేశ పెట్టింది. అవి; (a). ఇతర వెనక బడిన తరగతుల 27% కోటాలో పేద వర్గాలకి (ఆర్థిక స్థితిగతులని బట్టి) ప్రాముఖ్యత నివ్వాలి. (b). ఉన్నత కులాలలో ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి ఉద్యోగాలలో 10% రిజర్వేషన్లు ఇవ్వాలి. ప్రస్తుతం ఏ రిజర్వేషన్ల స్కీములో ఈ వర్గాల వారు లేరు. 16(4) ప్రకరణ పరిధిని విస్తరించి, వెనకబడిన తరగతుల

వారికి రిజర్వేషన్లని కలిగించడానికి దోహదపడిన ప్రఖ్యాత మండల్ కేసు ని సుప్రీంకోర్టు విచారించింది. ఉన్నత కులాలలోని పేద వర్గాల వారికి సూచించిందిన 10% అదనపు రిజర్వేషన్లని కోర్టు తిరస్కరించింది. అయితే కొన్ని షరతులపై ఓబీసీలకు 27% రిజర్వేషన్ల రాజ్యాంగ బద్దతని ఆమోదించింది. a). వెనకబడిన తరగతులలో ఉన్నత వర్గాల(క్రిమీలేయర్)ని రిజర్వేషన్ల సదుపాయాల నుండి తొలగించాలి. b). ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఉండరాదు; మొదట చేసే నియామకాలలో రిజర్వేషన్లు పరిమితం కావాలి. ఏమైనా ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ అయిదు సంవత్సరాలకే ఉండాలి. (i.e.1997) C). కొన్ని ప్రత్యేక పరిస్థితులలో తప్ప మొత్తం రిజర్వేషన్ల కోటా 50% మించరాదు. ఈ నిబంధనని ప్రతి సంవత్సరం పాటించాలి. d). భర్తీ చేయని వేకెన్సీలలో 'క్యారీ ఫార్వర్ రూల్' ఆమోద యోగ్యమే. అయితే 50% నిబంధనని ఇది అతిక్రమించరాదు. e). ఇతర వెనకబడిన తరగతులు (ఓబీసీ) జాబితాలో over- inclusion and under-inclusion జరిగిందనే ఆరోపణలని పరిశీలించడానికి ఒక శాశ్వత చట్టబద్ధమైన సంస్థని ఏర్పాటు చేయాలి. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ క్రింది చర్యలను తీసుకుంది : a). ఓబీసీలలో క్రిమీలేయర్ ని గుర్తించడానికి రామ్ నందన్ కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీ 1993లో తన నివేదికను సమర్పించింది. ఈ నివేదికను ప్రభుత్వం ఆమోదించింది. b). 1993లో జాతీయ వెనకబడిన తరగతుల కమీషన్ను ఒక పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించడం జరిగింది. ఉద్యోగ నియామకాల్లో ప్రకటించిన కులాల జాబితాలోని inclusion , execlusion ఇది పరిశీలిస్తుంది. c). ప్రమోషన్ల విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పుని రద్దు చేయడానికి, 1995లో 77వ రాజ్యాంగ సవరణ చట్టం ఏర్పడింది. ఈ చట్టం రాజ్యాంగంలో 16వ ప్రకరణలో ఒక కొత్త అంశాన్ని చేర్చింది. దీని ప్రకారం రాష్ట్ర సర్వీసులలో తగినంత ప్రాతినిథ్యం లేని షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి రాజ్యం ఏ సర్వీసులలోనైనా ప్రమోషన్లలో రిజర్వేషన్లని కల్పించవచ్చును. ఇంతే కాక, 85వ రాజ్యాంగ

సవరణ చట్టం, 2001 ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్ల విషయంలో 'Consequential Seniority ని వర్తింప జేసింది. ఈ చట్టం పూర్వ అన్వయ ప్రభావం (Retrospective Effect)తో జూన్ 1995 నుండి అమలులోనికి వచ్చింది. d). 81వ రాజ్యాంగ సవరణ చట్టం, 2000 బ్యాక్ లాగ్ వేకన్సీల పై తీర్పుని నిర్వీర్యం చేసింది. 16వ ప్రకరణకు ఇది ఒక కొత్త అంశాన్ని చేర్చింది. దీని ప్రకారం ఒక సంవత్సరంలో కానీ లేదా సంవత్సరాలలో కానీ పూరించబడని రిజర్వ్ ఖాళీలను ఒక ప్రత్యేకమైన ఖాళీల శ్రేణిగా రాజ్యం పరిగణించడానికి అధికారంని పొందుతుంది. ఈ శ్రేణిలోని రిజర్వేషన్లని ఇతర సంవత్సరాలలో మొత్తం సీట్ల సంఖ్యలలో 50% సీలింగ్ ని నిర్ధారించే ఖాళీలలో కలుపరాదు. సంక్లు ప్తంగా చెప్పాలంటే, బ్యాక్ లాగ్ వేకన్సీలకు గల 50 % సీలింగ్ ని ఇది రద్దు చేసింది. e). 50 శాతం సీలింగ్ ని అతిక్రమించి 69% రిజర్వేషన్లని కేటాయించిన తమిళనాడు రిజర్వేషన్స్ ఆక్ (1994) ని న్యాయ సమీక్షకు అతీతంగా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చడానికి 1994లో 76వ రాజ్యాంగ సవరణ చట్టం చేయడం జరిగింది. 4. అస్పృశ్యత రద్దు 17వ ప్రకరణ ప్రకారం “అస్పృశ్యత” రద్దు చేయడమైనది. దానిని ఏ విధంగాను పాటించరాదు. దాని అమలులో ఎటువంటి అసమర్థత లోపమైనా చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరం”. 1976లో "అస్పృశ్యతా నేర చట్టం , 1955(The Untouch- ability (Offences) Act, 1955)” ని సమగ్రంగా సవరించి "పౌర హక్కుల చట్టం " (Protection of civil Rights Act) 1955గా నామకరణం చేయడం జరిగింది. దీని ప్రకారం అస్పృశ్యతని పాటించే వారు తీవ్రమైన శిక్షకు గురికావలసి వస్తుంది. ఈ చట్టం 17వ ప్రకరణలోని అస్పృశ్యతని రద్దు చేయడానికి పొందిన హక్కు పౌరహక్కు అని నిర్వహించింది. 'అస్పృశ్యత (Untouchability)' అనే పదానికి రాజ్యాంగం కానీ, పై చట్టంకానీ ఎటువంటి నిర్వచనాన్ని ఇవ్వ లేదు. అయితే మైసూర్ హైకోర్టు అభిప్రాయం ప్రకారం 17వ ప్రకరణలో ఉ న్న అస్పృశ్యత లేదా అంటరానితనం అనే పదాన్ని కులతత్వ నేపథ్యంలో గమనించాలని, దేశ చరిత్రలో తరతరాలుగా ఈ

దురాచారం ఉందని పేర్కొన్నది. పుట్టుకను బట్టి కొన్ని వర్గాలపై సామాజిక రుగ్మతలను రుద్దడం జరిగిందని కోర్టు పేర్కొన్ననది. పౌర హక్కుల రక్షణ చట్టం(1955), ప్రకారం అస్పృశ్యత నేరాలకి ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ. 500 జరిమానా లేదా రెండూ ఉండవచ్చు. అస్పృశ్యత నేరం ద్వారా శిక్ష పడిన వ్యక్తి పార్లమెంట్ కి కానీ, రాష్ట్ర శాసన సభకి పోటీ చేయడానికి అనర్హుడు అవుతాడు. ఈ క్రింది చర్యలను ఈ చట్టం నేరాలుగా ప్రకటించింది. a). ఆరాధనా స్థల ప్రవేశాన్ని లేదా ఆరాధించడాన్ని ఏ వ్యక్తినైనా నిరాకరించడం; b). అస్పృశ్యతను సాంప్రదాయ, మత, తాత్విక కారణాలతో సమర్థించడం; C). దుకాణాలలో, హోటళ్లలో లేదా సార్వజనీన వినోద స్థలాల్లో ప్రవేశాన్ని నిరాకరించడం. d). అస్పృశ్యత అనే భావంతో షెడ్యూల్ కుల వ్యక్తిని అవమానించడం. 2). ప్రజా ప్రయోజనార్థం స్థాపించిన వైద్య శాలలో, విద్యా సంస్థలలో, హాస్టల్లో వ్యక్తికి ప్రవేశాన్ని నిరాకరించడం. f). ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అస్పృశ్యత గురించి బోధన చేయడం. g). వస్తువులను అమ్మడానికి నిరాకరించడం లేదా సేవలను చేయడానికి నిరాకరించడం. 17వ ప్రకరణలోని హక్కు ప్రయివేట్ వ్యక్తులకు వ్యతిరేకమైనదని, కనుక ఈ హక్కుకి ఎటువంటి భంగం జరగకుండా తగిన చర్యలను తీసుకోవలసిన రాజ్యాంగం బాధ్యత రాజ్యానికి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. 5. బిరుదుల రద్దు 18వ ప్రకరణ బిరుదులని రద్దు చేస్తుంది. ఈ విషయంలో దీనిలో నాలుగు అంశాలు ఉన్నాయి. అవి; a). సైనిక, విద్యాపరమైన విశిష్ట యోగ్యతలను తప్పించి రాజ్యం ఏ వ్యక్తికి (పౌరుడైనా, విదేశీయుడైనా) ఏ బిరుదులను ఇవ్వరాదు'. b). ఏ పౌరుడు విదేశీ రాజ్యం నుంచి ఏ బిరుదును స్వీకరించరాదు.

C). రాజ్యా ధీనంలో లాభసాటి పదవిని, విశ్వాసకరమైన పదవిని నిర్వహించే ఏ విదేశీయుడు కూడా రాష్ట్రపతి సమ్మతి లేకుండా విదేశీ రాజ్యం నుంచి ఏ బిరుదులు స్వీకరించరాదు. d). రాజ్యా ధీనంలో లాభసాటి పదవిని, విశ్వాసమైన పదవిని నిర్వహించే పౌరుడు లేదా విదేశీయుడు రాష్ట్రపతి అనుమతి లేకుండా ఏ విదేశీ రాజ్యం నుంచి ఏ బహుమతిని, జీతభత్యాలను పదవిని పొందరాదు. పై అంశాలని తెలుసుకున్న తర్వాత, కొన్ని విషయాలు స్పష్ట మవుతాయి. వలసవాద పాలకులు ప్రధానం చేసిన ఉన్నత వంశాలకు చెందిన వారసత్వ బిరుదులు -మహారాజా, రాజ్ బహదూర్, రామ్ బహదూర్, రామ్ సాహెబ్, దివాన్ బహదూర్ మొ|| వాటిని 'సమాన హెూదా సూత్రానికి' విరుద్ధమైన కాణంగా వీటిని 18వ ప్రకరణ నిషేదిస్తుంది. భారతరత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ వంటి జాతీయ పురస్కారాలు రాజ్యాంగ బద్దమేనని సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. ఇవి ప్రత్యేక పురస్కారాలే కానీ బిరుదులు కావని న్యాయస్థానం అభిప్రాయ పడింది. అయితే ఈ పురస్కారాలని తన పేరుకు ముందు కానీ పేరుకు వెనక కానీ(Prefix or Suffix) పురస్కార గ్రహీత ఉంచుకోకూడదని కోర్టు అభిప్రాయ పడింది. ఒక వేళ అలాచేస్తే పురస్కార గ్రహీత తన పురస్కారాన్ని కోల్పోతాడు అని కూడా కోర్టు పేర్కొన్నది. ఈ 1954లో ఈ జాతీయ పురస్కారాలని ఏర్పాటు చేయడం జరిగింది. మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా పార్టీ 1977లో దీనిని ఆపేసింది. అయితే ఇందిరాగాంధీ ప్రభుత్వం 1980లో వీటిని పునరుద్దరించింది. స్వేచ్చా హక్కు 1. ఆరు హక్కులకు రక్షణ 19వ ప్రకరణ పౌరులకు ఆరు హక్కులకు హామీ ఇస్తుంది. అవి: i). వాక్ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ హక్కు ii). శాంతియుత నిరాయుధ సమావేశ హక్కు ii). సంస్థలను లేదా యూనియన్లని లేదా సహకార సంఘాలను 19(a) ఏర్పాటు చేసుకునే హక్కు iv). భారత భూభాగంలో స్వేచ్చగా సంచరించే హక్కు 


Report Page