blog

blog

www.telugugeeks.in


1 . YOU  FOCUS ON SAVING MONEY THAN MAKING MONEY  


2 . You WANT TO GET PAID BASED ON YOUR TIME 


కొంత మంది ఎలా ఆలోచిస్తారు అంటే, నేను ఇంత టైం పని చేశా నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, సో నాకు ఈ పనిలో ఎక్కువ డబ్బు ఇవ్వాలి అని అనుకుంట ఉంటారు, కానీ కొంత మంది ఒక వేల్యూ create  చేస్తారు అందరికి ఉపయోగ పడే product చేస్తారు, నిజానికి వీళ్ళకి ఎక్స్పీరియన్స్ తో సంబంధం ఉండదు వీళ్ళకి ఆ productకి ఇంత అని వచ్చేస్తుంది, ఉదాహరణకి సూర్య , విజయ్ ఒకేసారి వ్యాపారం మొదలు పెట్టారు సూర్య ఏమో నేను ఇంత టైం పనిచేస్తే నాకు ఇంత రావాలి అనే మైండ్సెట్ లో ఉన్నవాడు, విజయ్ ఏమో ఏదైనా వేల్యూ create  చేస్తే మనకి డబ్బులు వస్తాయి అని తెల్సిన వాడు ,  అప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఆ వ్యాపారానికి సంబంధించిన పనులు, క్లైంట్స్ కి, ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత టైం పడుతుంది, దానికి 2 ఏళ్ళు పట్టింది అనుకుందాం, ఇంత చేసిన  వ్యాపారం లో సక్సెస్ అవుతారు అని గారంటీ లేదు, అప్పుడు, సూర్య ఎం చేస్తాడు అంటే నేను ఇన్ని ఏళ్ళు కష్టపడినా నాకు డబ్బు రాలేదు అని ఆ వ్యాపారాన్ని వదిలేస్తాడు, విజయ్ మాత్రం డబ్బు ని expect  చేయకుండా , నేను ఇంకా కరెక్ట్ గా పని చేయలేదు  అని ఎక్కువ గా కష్టపడి తన ప్రోడక్ట్ ని అందరికి ఉపయోగకరంగా మార్చి డబ్బులు సంపాదిస్తాడు. అందుకే మీ వ్యాపారం లో ఇంత సమయానికి ఇంత రావాలి అనే లెక్క వేయకండి, మీ ప్రోడక్ట్ ని నమ్మండి, దాన్ని జనాలకి ఉపయోగకరంగా ఎలా చేయాలి అని ఆలోచించండి, డబ్బే మిమల్ని వెతుకుంటుం వస్తుంది.


3 . You SURROUND YOURSELF WITH WRONG People 


4 . You HAVEN'T STARTED INVESTING YET 


ఇది అందరికి జరిగే విషయమే, ఉద్యోగం వచ్చాక అనుకుంటాం, ఏదొక దాంట్లో ఇన్వెస్ట్ చేదాం అని, కానీ అప్పుడు ఏదో ఒక అవసరాలు పడి ఇన్వెస్ట్మెంట్ కోసం దాచిన డబ్బులను వేరే వాటి కోసం వాడేస్తాం, అలా అలా లేట్ 40 's  లో కి వచ్చేసరికి అరె ఎందులో అయిన ఇన్వెస్ట్ చేయాలి అని మల్లి అనుకుంటాం, దీనికి ఒక కారణం ఏంటి అంటే ఇప్పుడు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేస్తే దాని రిటర్న్స్ ఎప్పుడు వస్తాయో తెలీదు, అందుకే చాలా మంది ఇన్వెస్ట్ చేయరు, కానీ ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇరవై ఏళ్ళు అప్పుడు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేస్తే  కనీసం మీరు నలభై ఏళ్ళకి అయినా దాని మీద రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకే ఎప్పుడయినా మీరు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ లు చేయండి, 


5 .You are BUYING WHAT YOU CAN'T AFFORD 


6 . You STOP LEARNING AFTER COLLEGE 


మన కాలేజీ అయిపోయాక, హమ్మయ్య చదువు పని అయిపోయింది, మనం చదివిన చదువు ఉపయోగించి , మనం సంపాదించడం మొదలుపెట్టాలి అని అనుకుంటాం,  ఇది ఒక అంత వరుకు నిజమే, కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎదగాలి అంటే ఎప్పుడు నిరంతరం మన పని లో మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి, ఎప్పుడు అయితే మనం నేర్చుకుంటాకి ఏమి లేదు అని నేర్చుకుంటాం ఆపేస్తామో, మనం ఎదగటం కష్టం అయిపోతుంది. బాధాకరమైన విషయం ఏంటంటే చాలా కాలేజీ లో స్కూల్ లో, జీవితం లో ఉపయోగపడే స్కిల్స్ నేర్పించారు, జనాలతో ఎలా మాట్లాడాలి, మంచి కనెక్షన్స్ ఎలా మైంటైన్ చేయాలి,టీం ని ఎలా బిల్డ్ చేయాలి, ప్రాజెక్ట్స్ ఎలా ప్లాన్ చేయాలి, డీల్స్ ఎలా మాట్లాడాలి ఇలాంటివి మన బిజినెస్ లో మన జీవితం లో ఎంతగానో ఉపయోగపడేవి. వీటిని మనం ప్రాక్టికల్ గా నే నేర్చుకోవాలి. ఇలాంటివాటి వల్ల మనకి మన డబ్బు ని ఎలా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది, కనెక్షన్స్ మైంటైన్ చేయటం వల్ల వాళ్ళు చేస్తున్న తప్పులు ఏంటి వాళ్ళు చేస్తున్న మంచి ఇన్వెస్ట్మెంట్లు ఏంటి తెల్సుకోవచ్చు. ఇవి అన్ని నీ ఇన్వెస్ట్మెంట్ ని మెరుగు పరిచి, మిమల్ని ధనవంతుడిని చేయడానికి ఉపయోగ పడుతుంది.


7 You are TRYING TO GET RICH FAST 


మళ్ళి కొంత మందిని బాధ పెట్టె నిజం ఏంటంటే ఫాస్ట్ గా ఎవరు రిచ్ అవ్వలేరు, లాటరి లో తప్ప, youtube లో చాల వీడియోలు  ఉంటాయి వారం లో ఇంత సంపాదించొచ్చు, నెల లో ఇంత  సంపాదించొచ్చు అని, ఇవన్నీ ట్రై చేసిన వాళ్ళని ఒకసారి అడగండి, వాటివల్ల ఎవడు ధనవంతుడు అవ్వలేదు అనే విషయం చెప్తారు,. చాలా ఫార్వర్డ్ మెసేజ్ లు వస్తాయి కొన్ని campaigns  వస్తాయి,  వెంటనే ఇంత డబ్బు వస్తుంది అని చెప్తారు  , వాటిని ఇంక జీవితం లో చూడకండి, అలాంటి మెసేజ్ లు వస్తే డిలీట్ బటన్ నొక్కేయండి, ఈ ప్రపంచం లో ధనవంతుడు అవ్వాలి అంటే ఒకటే దారి, అది చాలా బోరింగ్ గా ఉంటుంది, అయిదు పది లేదా పదిహేను ఏళ్ళ లో ఇంత సంపాదించాలి దానికి దారి ఇది అని నిర్ణయించుకోండి, ఆ ప్లాన్ కి స్టిక్ అవ్వండి, మధ్య లో వచ్చే చెత్త యాడ్స్ కి మీ డ్రీం వదులుకోకండి. మీరు తప్పకుండ ధనవంతులు అవుతారు.


మేము ఇప్పుడు మీకు ఒక మనిషిని ధనవంతుడు అవ్వనివ్వకుండా ఆపుతున్న 7 కారణాలు గురించి చెప్పాను, ఇంతకు మించి కూడా ఉండొచ్చు, మీరు ఏమంటారు, మిమల్ని ఆపుతున్న కారణం ఏంటి? మా వీడియో మీకు ఎలా అనిపించింది? కామెంట్స్ లో చెప్పండి. మా ఛానల్ కి subscribe  చేసుకుంటం మరిచిపోతే ఇప్పుడే ఆ సబ్స్క్రయిబ్ బటన్ ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ ని కూడా ఆక్టివేట్ చేసుకోండి , ​

Report Page